For Money

Business News

హైదరాబాద్‌లో శాఫ్రాన్‌ రూ.1200 కోట్ల పెట్టుబడి

ఫ్రాన్స్‌కు చెందిన బహుళజాతి సంస్థ శాఫ్రాన్‌ హైదరాబాద్‌లో తమ అతిపెద్ద, తొలి ఎయిర్‌క్రాఫ్ట్‌ ఇంజిన్‌ మెయింటేనెన్స్‌, రిపేర్‌, ఓవరాల్‌ (ఎంఆర్‌వో) కేంద్రాన్ని నెలకొల్పనుంది. ఎయిర్‌క్రాఫ్ట్‌, రాకెట్‌ ఇంజిన్ల డిజైన్‌, తయారీలో ఈ కంపెనీకి మంచి పేరుంది. ఎయిర్‌బస్‌ గ్రూప్‌, బోయింగ్‌లకు అనేక కీలక విడి పరికరాలను తయారు చేసేఏ ఈ కంపెనీ 2018 ఫిబ్రవరిలో జోడియాక్‌ ఏరోస్పేస్‌ను శాఫ్రాన్‌ చేజిక్కించుకోవడంతో పెద్ద కంపెనీగా అవతరించింది. ఈ కంపెనీ ఇపుడు హైదరాబాద్‌లో రూ.1,200 కోట్లతో ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తోంది. ఈ విషయాన్ని రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు.ప్రస్తుతం దేశ, విదేశాల్లో నడుస్తున్న ఎన్నో ఎయిర్‌లైన్స్‌ విమానాల్లో శాఫ్రాన్‌ ఇంజిన్లే ఉన్నాయి. ఇకపై వీటి మెయింటేనెన్స్‌, రిపేర్‌, ఓవరాల్‌ అంతా హైదరాబాద్‌లో జరగనుంది.