For Money

Business News

జీఎస్టీ స్లాబుల సంఖ్య తగ్గింపు?

ఇపుడున్న జీఎస్టీ స్లాబుల సంఖ్యను తగ్గించనున్నారు. వచ్చే జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశంలో ఈ అంశంపై నిర్ణయం తీసుకోనున్నారు. జీఎస్టీ స్లాబుల హేతుబద్దీకరణ కోసం ఇప్పటికే కర్ణాటక సీఎం బొమ్మై నేతృత్వంలో కమిటీ ఏర్పడింది. ఈ కమిటీ ఈనెలలో భేటీ కానుంది. ఇపుడు 1.5 శాతం, 3 శాతం, 5 శాతం, 12 శాతం, 18 శాతం, 28 శాతం .. అంటే ఆరు స్లాబులు ఉన్నాయి. దీనివల్ల గందరగోళంగా ఉందని.. వీటిని తగ్గించాలని భావిస్తున్నారు. ప్రభుత్వ రెవెన్యూ తగ్గకుండా వీటిని మార్చేందుకు కమిటీ ప్రయత్నించనుంది. వచ్చే కౌన్సిల్‌ సమావేశంలో లోపు ఈ కమిటీ నివేదిక ఇవ్వనుంది.