For Money

Business News

రేజర్‌పే, పేటీఎంపై ఈడీ దాడులు

పే టీఎం గేట్‌వే కంపెనీలు అయిన రేజర్‌ పే, పే టీఎంతో పాటు క్యాష్‌ఫ్రీ కంపెనీలపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు దాడులు జరుపుతున్నారు. కర్ణాటకలోని ఆరు ప్రాంతాల్లో ఈ దాడులు నిన్నటి నుంచి జరుగుతున్నట్లు ఈడీ అధికారులు తెలిపారు. చైనా లోన్‌ యాప్‌లపై జరుగుతున్న దర్యాప్తులో భాగంగా ఈ దాడులు జరుగుతున్నాయి. పేటీఎం ప్రమోటర్లలో చైనా కంపెనీలు కూడా ఉన్న విషయం తెలిసిందే. చైనా వ్యక్తుల ఆధీనంలోని కంపెనీల బ్యాంకు ఖాతాల్లో దాచి ఉంచిన రూ.17 కోట్ల నిధులను జప్తు చేసినట్లు ఈడీ అధికారులు తెలిపారు. దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని చెప్పారు. భారతీయులకు చెందిన ఫేక్‌ డామ్యెమెంట్లను ఉపయోగించి దొంగ డైరెక్టర్లను తయారు చేశారని, వారు డైరెక్టర్లుగా ఈ కంపెనీ కొనసాగుతున్నారని పేర్కొన్నారు.