For Money

Business News

తప్పక దరఖాస్తు చేయండి

AI ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ రంగానికి చెందిన ESDS సాఫ్ట్‌వేర్‌ సొల్యూషన్‌ పబ్లిక్‌ ఆఫర్‌ ఇపుడు కొనసాగుతోంది. తొలి రోజే రెండు రెట్లు ఆదరణ పొందిన ఈ ఆఫర్‌ ఐటీ రంగంపై ఫోకస్‌ చూపుతున్న ఇన్వెస్టర్లకు బెస్ట్‌ ఆఫర్‌. ఇపుడు మార్కెట్‌లో ఉన్న E2E నెట్‌వర్క్స్ వంటి కంపెనీలతో పోలిస్తే చక్కటి వ్యాల్యుయేషన్స్‌తో వచ్చిన కంపెనీ. E2E నెట్‌వర్క్స్‌ షేర్‌ ఆ కంపెనీ ఎంటర్‌ప్రైజస్‌ వాల్యూకు 98 రెట్ల వద్ద ట్రేడవుతోంది. ఇపుడు ESDS షేర్‌ 12.2 రెట్లకే లభిస్తోంది. పైగా పబ్లిక్‌ ఇష్యూకు దరఖాస్తు చేసుకున్న సమయానికి… అప్పటి వరకు చేతిలో ఉన్న ప్రాజెక్టుల ఆధారంగా వ్యాల్యుయేషన్‌ లెక్కగట్టారు. ఈలోగా ఆస్ట్రేలియా కంపెనీతో పాటు మరో భారీ ప్రాజెక్టు ఈ కంపెనీ వచ్చింది. ఇవి ఇష్యూ ధర సమయంలో పరిగణనలోకి తీసుకోలేదు. ఈ లెక్కన ఈ షేర్‌ ప్రీమియం ఇన్వెస్టర్లకు అనుకూలంగా ఉందనే చెప్పాలి. ఐటీ ప్రాజెక్టులకు అవసరమైన మౌలిక సదుపాయలు అందించే ఈ కంపెనీ సర్వర్లను అద్దెకు ఇస్తుంది. నాసిక్‌, నవి ముంబై, బెంగళూరు, మొహాలిలో ఈ కంపెనీకి డేటా సెంటర్లు ఉన్నాయి. కోల్‌కతా, సహిబాబాద్‌లో మరో రెండు డేటా సెంటర్లు రానున్నాయి. ఐపీఓ ద్వారా వచ్చే సొమ్ముతో ఈ డేటా సెంటర్ల సామర్థ్యాన్ని మరింత పెంచనున్నారు. పైగా ఈసారి పబ్లిక్‌ ఆఫర్‌ కింద ప్రస్తుత ఇన్వెస్టర్లు, ప్రమోటర్లు వాటా అమ్మడం లేదు. మొత్తం తాజా షేర్ల జారీనే. ఇపుడు కంపెనీలో ముకుల్‌ అగర్వాల్‌, ఆశిష్‌ కచోలియా, యాంకరేజ్‌ క్యాపిటల్‌, కాప్రి గ్లోబల్‌ వెంచర్స్‌ ఉన్నారు. వీరెవరూ ఈ ఇష్యూ కింద తమ వాటాను విక్రయించడం లేదు. పైగా కంపెనీ ఆర్థిక పనితీరు కూడా ఏటా పెరుగుతోంది. FY25లో 26 శాతం, FY26లో కంపెనీ ఆదాయం 31 శాతం పెరిగింది. అలాగే నికర లాభం రెట్టింపై రూ. 55.6 కోట్ల నుంచి రూ. 120.8 కోట్లకు పెరిగింది. ఇపుడు ఎబిటా మార్జిన్‌ 50 శాతం వరకు ఉంటోంది. కొత్త ప్రాజెక్టులను పరిగణనలోకి తీసుకుంటే ఈ షేర్‌ ఇన్వెస్టర్లకు ప్రతిఫలం ఇవ్వనుంది. లిస్గింగ్‌ లాభాలు కూడా ఆకర్షణీయంగా ఉండదనుంది. ధరల శ్రేణి రూ. 408-రూ.429. గరిష్ఠ ధరను పరిగణనలోకి తీసుకుంటే మార్కెట్‌ క్యాప్‌ రూ 5000 కోట్ల ప్రాంతంలో ఉంటుంది. లిస్టింగ్‌ తరవాత చాలా స్పీడుగా రూ. 10,000 కోట్లను దాటే అవకాశముంది.

Leave a Reply