రూ.లక్షకే కోణార్క్
అమెరికా, ఇరాన్ యుద్ధం తరవాత దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల జోరు పెరిగింది. అమ్మకాలు భారీగా పెరిగాయి. ప్రముఖ ఈవీ కంపెనీ ఏథర్ తాజాగా కోణార్క్ పేరుతో మరో స్కూటర్‌ను మార్కెట్లోకి తెచ్చింది. S, Z అనే రెండు రకాలలో లభించే ఈ స్కూటర్ ప్రారంభ ధర లక్ష రూపాయలను కంపెనీ పేర్కొంది. వీటిలో 2.1kWh బ్యాటరీ సామర్థ్యం ఉన్న S100 వేరియంట్ సింగిల్ ఛార్జ్‌తో 100 కి.మీ. (IDC) వరకూ ప్రయాణించవచ్చు. 2.7kWh, 3.5kWh బ్యాటరీ సామర్థ్యంతో పనిచేసే వేరియంట్స్ కూడా తెచ్చింది. వీటి గరిష్ట స్పీడ్ గంటకు 70 కి.మీగా కంపెనీ పేర్కొంది. కోణార్క్ ఈవీ 450W ఆన్‌బోర్డ్ ఛార్జర్‌తో వస్తుంది. దీనిని 900W ఆఫ్ బోర్డ్ ఛార్జర్‌కు అనుసంధానించవచ్చని, అలా చేస్తే మొత్తం చార్జింగ్ సామర్థ్యం 1.35kWకు చేరుతుంది. కేవలం 10 నిమిషాల్లో బ్యాటరీ ఛార్జ్ చేయొచ్చని పేర్కొంది. ఒకసారి బ్యాటరీ చార్జ్ చేస్తే 13కి.మీ. దూరం ప్రయాణింవచ్చని కంపెనీ వెల్లడించింది.
