జియో ఐపీఓ రెడీ
జియోప్లాట్‌ఫామ్స్ ఐపీఓకు రంగం సిద్ధమైంది. జియో ఐపీఓకు స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ అనుమతి లభించింది. రూ. 10 ముఖ విలువగల 27 కోట్ల షేర్లను విక్రయించడం ద్వారా మార్కెట్ నుంచి జియో రూ.37,700 కోట్లు సమీకరించనుంది. కంపెనీ ఈక్విటీలో 2.9 శాతం వాటాను పబ్లిక్ ఇష్యూలో భాగంగా జియో అమ్మనుంది. ఈ ఇష్యూ ద్వారా జియో కొత్త రికార్డు సృష్టించనుంది. ఇప్పటి వరకు హుందాయ్ ఇండియా చేసిన రూ. 28,870 కోట్ల పబ్లిక్ ఇష్యూనే అతి పెద్ద ఇష్యూగా రికార్డు ఉంది. దీన్ని ఇపుడు జియో తిరగరాయనుంది. పమీకరించిన మొత్తంలో ఏకంగా రూ. 27500 కోట్లను రుణాలు తిరిగి చెల్లించేందుకు ఉపయోగిస్తారు. కంపెనీలో రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు 66.43 శాతం వాటా ఉండగా, మోటాకు 9.98 శాతం, గూగుల్‌కు 7.73 శాతం వాటా ఉంది. ఇంకా సౌదీ అరేబియాకు చెందిన పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్, విస్టా ఈక్విటీ పార్ట్నర్స్, సిల్వర్ లేక్, ముదాబాలా, జనరల్ ఎలక్ట్రిక్ సింగపూర్ కంపెనీలకు కూడా వాటా ఉంది. గత మార్చితో ముగిసిన త్రైమాసికంలో జియో ప్లాట్‌ఫామ్స్ రూ. 1.49 లక్షల టర్నోవర్‌పై రూ. 30.064 కోట్ల నికర లాభం ఆర్జించింది. కంపెనీ వ్యాల్యూయేషన్ 13,700 కోట్ల డారల్లుగా అంచనా వేస్తున్నారు.
