For Money

Business News

నిఫ్టిని మర్చిపోవడమే బెటర్‌

ప్రపంచ మార్కెట్లు జోరు మీద ఉన్నా… మన మార్కెట్లు చాలా నిస్తేజంగా మారుతున్నాయి. నిఫ్టి గరిష్ఠ స్థాయికి చేరి 700 రోజులు దాటింది. దాన్ని దాటడం కాదు కదా… కనీసం దరిదాపుల్లో కూడా వెళ్ళ పరిస్థితి కన్పించడం లేదు. అందుకే నిఫ్టి బదులు… మంచి పనితీరు కనబరుస్తున్న షేర్లపై ఇన్వెస్టర్లు దృష్టి పెట్టడం బెటర్‌. నిఫ్టి ఇవాళ కూడా నష్టాలతో ప్రారంభం కానుంది. క్రూడ్‌ దెబ్బకు నిఫ్టి కోలుకోలేకపోతోంది. చాలా షేర్లలోప్రమోటర్లు తమ వాటాను అమ్ముకోవడం ఒకవైపు, కొత్త ఇష్యూల హోరు… సెకండరీ మార్కెట్‌ లిక్విడిటీపై ప్రభావం చూపుతోంది. ఇవాళ నిఫ్టికి దిగువస్థాయిలో మద్దతు లభిస్తుందో లేదో చూడాలి. మన దేశంలో కూడా కొన్ని ఏఐ, చిప్‌, పవర్‌ రంగాలకు చెందిన షేర్లు ఏఐ బూమ్‌తో పెరుగుతున్నాయి. ఏఐ డేటా సెంటర్లకు సంబంధించిన షేర్లు కూడా. అలాగే మెటల్స్‌ షేర్లపై దృష్టి పెట్టడం బెటర్‌. నిఫ్టికి ఇవాళ దిగువ స్థాయిలో మద్దతు లభించకుంటే 24000 స్థాయి డేంజర్‌ జోన్‌లో పడినట్లే. బులియన్‌పై కస్టమ్స్‌ తగ్గిస్తారని వార్తలు రావడంతో నిన్న 2.3 శాతం మేర గోల్డ్‌, సిల్వర్‌ ETF ధరలు తగ్గాయి. గోల్డ్‌ ఫైనాన్స్‌ కంపెనీల షేర్లల్లో భారీ అమ్మకాలు వచ్చాయి. ముత్తూట్‌ ఫైనాన్స్‌ వంటి షేర్లు ఆరు శాతం నష్టపోయాయి. త్వరలోనే NSE ఐపీఓకు అనుమతి వస్తుందని సెబీ చీఫ్‌ అన్నారు. దీంతో క్యాపిటల్‌ మార్కెట్‌ షేర్లపై కన్నేయడం మంచిది. మరోవైపు యధార్థ్‌ హాస్పిటల్‌ టేకోవర్‌కు అడ్వెంట్‌, ఆస్టర్‌ డీఎం చర్చలు జరుపుతున్నట్లు ఇవాళ ఎకనామిక్‌ టైమ్స్‌ పత్రిక వార్త రాసింది. దీన్ని యధార్థ్‌ హాస్పిటల్స్‌ ఖండించినా… ఈ వార్తతో హాస్పిటల్‌ షేర్లలో ఆసక్తి రావొచ్చు.

Leave a Reply