For Money

Business News

ఐటీసీ చేతికి హ్యాపియస్ట్‌ మైండ్స్‌!

హ్యాపియస్ట్‌ మైండ్స్‌ టెక్నాలజీస్‌ లిమిటెడ్‌ను ఐటీసీ టేకోవర్‌ చేయనుంది. ఐటీసి అనుబంధ కంపెనీ ఐటీసీ ఇన్ఫోటెక్‌ ఈ కంపెనీని కొనుగోలు చేయనుంది. దీనికి సంబంధిచి అధికారిక ప్రకటన వచ్చే వారం వెలువడనుంది. ప్రస్తుతం హ్యాపియస్ట్‌ మైండ్స్‌లో ప్రమోటర్ అయిన అశోక్‌ సూతాకు 40 నుంచి 44 శాతం వాటా ఉంది. ఆయనకు పలు కంపెనీలు, ఎల్‌ఎల్‌పీ ద్వారా ఈ వాటా ఉంది. ఈ వాటాను ఐటీసీ ఇన్ఫోటెక్‌ తీసుకోనుంది. డీల్‌ విలువ రూ. 2600 కోట్ల నుంచి రూ. 2720 కోట్లు ఉండొచ్చని భావిస్తున్నారు. సెప్టెంబర్‌ 1వ తేదీన రెండు కంపెనీల బోర్డులు సమావేశమై డీల్‌ను ఖరారు చేసే అవకాశముంది. అశోక్‌ సూతా డీల్‌ తరవాత కంపెనీ వాటాదారులకు ఐటీసీ ఇన్ఫోటెక్‌ ఓపెన్‌ ఆఫర్‌ ప్రకటించనుంది. ఇవాళ హ్యాపియస్ట్‌ మైండ్స్‌ షేర్‌ 3.44 శాతం నష్టంతో రూ. 430.95 వద్ద ట్రేడవుతోంది.

Leave a Reply