For Money

Business News

డేంజర్ జోన్‌లో ‘నిఫ్టి 24000’

గత కొన్ని నెలలుగా నిఫ్టి తన 24,000 లెవల్‌ను కాపాడుకుంటూ వచ్చింది. కార్పొరేట్‌ ఫలితాలు అయిపోవడం, దేశీయంగా పెద్దగా ట్రిగ్గర్స్‌ లేకపోవడంతో నిఫ్టి ఇపుడు నిలదొక్కుకోవడం కష్టంగా మారుతోంది. గత కొన్ని సెషన్స్‌గా ఐటీ షేర్లు నిఫ్టిగా అండగా ఉంటున్నాయి. బ్యాంక్‌ నిఫ్టి కూడా నీరసించిపోయింది. మార్కెట్‌కు ట్రంప్‌ పెద్ద తలనొప్పిగా మారాడు. ఆయన ఎపుడు ఏం చేస్తాడా తెలియని పరిస్థితి. దేశ అధ్యక్షుడి మాటలకు విలువ లేని కాలం వచ్చేసింది. ఇరాన్‌పై ఇక దాడులు ఉండదని, ఆర్థిక ఆంక్షలేనని పేర్కొన్న కొన్ని గంటల్లోనే మళ్ళీ ఇరాన్‌పై అమెరికా దాడులు చేసింది. ఒక్కసారిగా క్రూడ్‌ భగ్గుమంది. దీంతో మన మార్కెట్‌ సెంటిమెంట్‌ దారుణంగా దెబ్బతింది. గిఫ్ట్‌ నిఫ్టి 110 పాయింట్లకు పైగా నష్టంతో ఉంది. నిఫ్టి ట్రెండ్‌ లైన్‌ 23,950 -24025 మధ్య ఉంది. మరి ఈ స్థాయిని నిఫ్టి కాపాడుకుంటుందా అన్నది చూడాలి. ఎందుకంటే ఈ స్థాయిని కోల్పోతే నిఫ్టి కనీసం ఆరేడు వందల పాయింట్లు కోల్పోయే ప్రమాదముంది. చాలా రోజుల తరవాత హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌కు గట్టి మద్దతు లభిస్తోంది. అనేక రీసెర్చి సంస్థలు ఈ బ్యాంక్‌కు పాజిటివ్‌ రిపోర్ట్‌ ఇస్తున్నాయి.

Leave a Reply