For Money

Business News

ఇక అన్నింటిపైనా జీఎస్టీ బాదుడు

జీఎస్‌టీ హేతుబద్ధీకరణపై ఏర్పాటైన మంత్రుల కమిటీ తన తాత్కాలిక నివేదిక సిద్ధం చేసింది. దీన్ని జీఎస్టీ కౌన్సిల్‌కు సమర్పించనుంది. ఈ నివేదికలోని ప్రధాన అంశాలను సీఎన్‌బీసీ టీవీ18 వెల్లడించింది.
కౌన్సిల్ ఏదైనా నిర్ణయం తీసుకునేందుకు ప్రజాభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోవాలని పేర్కొంది. సుదీర్ఘ సమాలోచనల తరవాత కొన్నింటికి మినహాయింపులు ఇచ్చినట్లు తెలిపింది. వీటిని సమీక్షించే సమయంలో చాలా జాగ్రత్తగా పరిశీలించాల్సిన అవసరం ఉందని పేర్కొంది.
హియరింగ్‌ ఎయిడ్స్‌, బ్రెడ్‌, ట్రాక్టర్స్‌, విద్యా సంస్థలకు ఇపుడు ఇస్తున్న రాయితీలను కొనసాగించాలి.
ప్రింటింగ్‌, రైటింగ్‌, డ్రాయింగ్‌ ఇంక్‌లపై జీఎస్టీ 12 శాతం నుంచి 18 శాతానికి పెంచాలి
ఎల్‌ఈడీ లైట్లు, ఫిక్సర్స్‌, ఎల్‌ఈడీ ల్యాంప్‌లపై జీఎస్టీ 12 శాతం నుంచి 18 శాతానికి
సోలార్‌ వాటర్‌ హీటర్‌, సిస్టమ్స్‌పై జీఎస్టీ 5 శాతం నుంచి 12 శాతం
ప్రభుత్వానికి సరఫరా చేసే కాంట్రాక్ట్‌ పనులపై జీఎస్టీ 5 శాతం నుంచి 12 శాతానికి
ఈ వేస్ట్‌పై 5 శాతం నుంచి 18 శాతానికి
ఇప్పటికు మినహాయింపు పొందిన బీమా పథకాలకు ఇచ్చిన మినహాయింపు ఎత్తివేత
ఈశాన్య రాష్ట్రాల ఎయిర్‌పోర్టుల నుంచి బిజినెస్ క్లాసులో ప్రయాణించే వారికి ఇస్తున్న మినహాయింపులు ఎత్తివేత
న్యూస్‌పేపర్లు, మ్యాగజైన్లు, రైల్వే ఎక్విప్‌మెంట్‌ రవాణపై ఇప్పటి వరకు ఇస్తున్న జీఎస్టీ మినహాయింపు ఎత్తివేత
ఆర్బీఐ అందించే సర్వీసులపై ఇప్పటి వరకు పన్నులు లేవు. ఆ మినహాయింపు ఎత్తివేత
అలాగే బీమా కంపెనీలకు IRDA అందించే సర్వీసులపై కూడా ఇక జీఎస్టీ
సెబి అందించే సర్వీసులపై ఇప్పటి వరకు జీఎస్టీ లేదు. ఇక నుంచి ఉంటుంది.
టెక్స్‌టైల్‌ కంపెనీలకు అందించే టైలరింగ్‌, ఇతర జాబ్‌ వర్క్‌లపై జీఎస్టీ 5 శాతం నుంచి 12 శాతానికి
ప్యాక్‌ చేసిన పెరుగు, మజ్జిగ, లస్సీలపై మినహాయింపు ఎత్తివేత
పలు రకాల బియ్యంపై ఇక నుంచి జీఎస్టీ
పాపడ్‌, పనీర్‌, తేనె, ఆహార ధాన్యాలు, పప్పు ధాన్యాలపై జీఎస్టీ మినహాయింపు ఎత్తివేత
బెల్లం, కొన్ని రకాల కాయగూరలకు ఇస్తున్న జీఎస్టీ మినహాయింపు ఎత్తివేత
రోస్ట్‌ చేయని కాఫీ గింజలు, ప్రాసెస్‌ చేయని టీ ఆకులపై 5 శాతం జీఎస్టీ
చెక్‌ బుక్కుల జారీపై జీఎస్టీ 18 శాతానికి పెంపు
ఆహార వ్యాపార ఆపరేటర్లకు FSSAI ఇస్తున్న సేవలపై ఉన్న మినహాయింపు ఎత్తివేత
హోటల్‌ రూము కు అద్దె రూ.1000లోపు ఉన్నా 12 శాతం జీఎస్టీ
హాస్పిటల్‌ రూమ్‌లో డైలీ అద్దె రూ.5000 (ఐసీయూ కాకుండా) ఉంటే 5 శాతం జీఎస్టీ
కార్డ్‌ బ్లడ్‌ బ్యాంకులకు మినహాయింపు ఎత్తివేత
ఆధ్యాత్మిక కేంద్రాల్లో రోజుకు రూ.5000 అద్దె ఉన్న వసూలు చేస్తే.. దానిపై ఉన్న మినహాయింపు ఎత్తివేత
నెలకు రూ.2500 కన్నా ఎక్కువగా ఉన్న షాపులకు ఇప్పటి వరకు జీఎస్టీ నుంచి మినహాయింపు ఉంది. దీన్ని ఎత్తివేతకు సిఫారసు