For Money

Business News

5 నెలల కనిష్టానికి బంగారం

అంతర్జాతీయ మార్కెట్‌లో డాలర్‌ పెరగడంతో బులియన్‌ మార్కెట్‌లో ఒత్తిడి కొనసాగుతోంది. గడచిన మూడు రోజుల్లో పది గ్రాముల స్టాండర్డ్‌ బంగారం ధర రూ. 1200 తగ్గింది. నిన్న రూ. 807 తగ్గిన బంగారం ఇవాళ కూడా బలహీనంగా ఉంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్‌ బంగారం ధర 1750 డాలర్ల ప్రాంతంలో ఉంది.ఈ స్థాయికి దిగువకు వస్తే బంగారంలో మరింత ఒత్తిడి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తోంది. మరోవైపు వెండి కూడా భారీగా క్షీణించింది. నిన్న ఒక్క రోజే వెండి కీలో ధర రూ. 2,150 తగ్గింది. ఇవాళ స్థిరంగా ఉంది. ఇవాళ కిలో వెండి రూ. 61,233 ప్రాంతంలో ట్రేడవుతోంది.