For Money

Business News

నిఫ్టి: భారీగా లాభాల స్వీకరణ

ఉదయం 11 గంటకల్లా మార్కెట్‌ తిరోగమనం ప్రారంభమైంది. ప్రపంచ మార్కెట్లకు భిన్న రోజూ భారీ లాభాలతో కొత్త రికార్డులు సృష్టించింది. 17,792 పాయింట్ల స్థాయిని అందుకున్నాక…నిఫ్టి క్రమంగా క్షీణిస్తూ మిడ్‌ సెషన్‌ లోగా నష్టాల్లోకి జారుకుంది. ఆ తరవాత కాస్త కోలుకున్నట్లు కన్పించినా… మళ్ళీ క్షీణించి ఇవాళ్టి కనిష్ఠ 17,537ని తాకింది. అంటే 250 పాయింట్లకు పైగా నష్టపోయిందన్నమాట. చివర్లో కాస్త కోలుకుని క్రితం ముగింపుతో పోలిస్తే 44 పాయింట్ల లాభంతో 17,585 పాయింట్ల వద్ద ముగిసింది. మిడ్‌ క్యాప్‌ సూచీ ఏకంగా ఒక శాతంపైగా నష్టపోయింది. ప్రైవేట్‌ బ్యాంక్‌ల మద్దతుతో బ్యాంక్‌ నిఫ్టి నామ మాత్రపు లాభాలకు పరిమితం కాగా, నిఫ్టి నెక్ట్స్‌ కూడా 0.8 శాతం తగ్గింది.

నిఫ్టి టాప్‌ గెయినర్స్‌
కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌ 2,014.10 5.63
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 1,585.55 1.64
భారతీ ఎయిర్‌టెల్‌ 729.50 1.52
ఐషర్‌ మోటార్స్‌ 2,900.00 1.39
మారుతీ 7,014.90 1.21

నిఫ్టి టాప్‌ లూజర్స్‌
టాటా స్టీల్‌ 1,382.80 -3.76
కోల్‌ ఇండియా 156.70 -3.45
ఎస్‌బీఐ 453.25 -2.25
టీసీఎస్‌ 3,826.55 -1.97
హిందాల్కో 473.80 -1.97