For Money

Business News

డాలర్‌ జూమ్… గోల్డ్‌ డౌన్‌

చాలా రోజుల తరవాత అమెరికా కరెన్సీ, స్టాక్‌ మార్కెట్లు పెరిగాయి. అమెరికా సెంట్రల్‌ బ్యాంక్‌ అయిన ఫెడరల్‌ రిజర్వ్‌ ఛైర్మన్‌గా జెరోమ్‌ పావెల్‌ను మరోసారి నియమిస్తూ అమెరికా అధ్యక్షుడు జొ బైడెన్‌ ఉత్తర్వులు జారీ చేశారు. అంటే బైడెన్ ఉన్నంత కాలం ఇక పావెల్‌ బ్యాంక్‌ ఛైర్మన్‌గా ఉంటారన్నమాట. ఎందుకంటే గవర్నర్‌ పదవీకాలం నాలుగేళ్ళు. పావెల్‌ నియామకంతో స్టాక్‌ మార్కెట్‌ భారీగా పెరిగింది. ఎస్‌ అండ్ పీ సూచీ 0.91, డౌజోన్స్‌, నాస్‌డాక్‌ 0.7 శాతంపైగా పెరిగాయి. అలాగే డాలర్‌ కూడా బలపడింది. తాజా సమాచారం ప్రకారం డాలర్‌ ఇండెక్స్ 96.40 వద్ద ట్రేడవుతోంది.డాలర్‌తో పాటు క్రూడ్‌ కూడా పెరగడం విశేషం. అయితే బంగారం ధరలు బాగా తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం 2 శాతం క్షీణించగా,వెండి ఒక శాతం తగ్గింది. ఇక మన దేశంలో ఫ్యూచర్స్‌ మార్కెట్‌లో (నవంబర్ బంగారం కాంట్రాక్ట్‌ ) రూ.774 క్షీణించగా, వెండి రూ.519 తగ్గింది.