For Money

Business News

గోడాడి డేటా చోరీ

వెబ్‌ హోస్టింగ్‌ కంపెనీ గో డాడి వద్ద ఉన్న డేటా చోరీకి గురైంది. గో డాడి వద్ద అనేక వర్డ్‌ప్రెస్‌ కస్టమర్స్‌ డేటా ఉంది. 12 లక్షల మంది యాక్టివ్‌, ఇన్‌ యాక్టివ్‌ కస్టమర్లకు చెందిన డేటాను థర్డ్‌ పార్టీ చోరి చేసిందని పేర్కొంది. సెప్టెంబర్‌ 6వ తేదీన ఈ ఘటన జరిగినట్లు తెలిపింది.తమ వద్ద ఉన్న వర్డ్‌ప్రెస్‌ హోస్టింగ్‌లో ఏదో అనూహ్య మార్పులు జరుగుతున్న అంశాన్ని గమనించి వెంటనే ఫోరెన్సిక్‌ సంస్థల సహాయం తీసుకుని దర్యాప్తు చేసినట్లు పేర్కొంది. ప్రభుత్వ అధికారులకు ఈ విషయం తెలిజేసినట్లు గోడాడీ పేర్కొంది. విషయం తెలిసిన వెంటనే థర్డ్‌ పార్టీకి యాక్సెస్‌ లేకుండా చేశామని, దర్యాప్తు జరుగుతోందని తెలిపింది.