For Money

Business News

వారెన్‌ బఫెట్‌ను దాటేసిన గౌతమ్‌ అదానీ

స్టాక్‌ మార్కెట్‌ కుప్పకూలుతున్నా… అదానీ గ్రూప్‌ షేర్లకు డిమాండ్‌ చెక్కు చెదరలేదు. కేవలం ఏడాదిలో తన సంపదను 56 శాతం పైగా పెంచుకున్న అదానీ గ్రూప్‌ ఛైర్మన్‌ గౌతమ్‌ అదానీ ఇపుడు ప్రపంచంలోనే అత్యంత ఐశ్వర్యవంతుల్లో అయదోస్థానానికి చేరారు. ప్రపంచ ప్రఖ్యాత స్టాక్‌ మార్కెట్‌ ఇన్వెస్టర్‌ వారెన్‌ బఫెట్‌ను దాటినట్లు ఫోర్బ్స్‌ పత్రిక పేర్కొంది. శుక్రవారం స్టాక్‌ మార్కెట్ క్లోజ్‌ అయ్యే సమయానికి 59 ఏళ్ళ గౌతమ్‌ అదానీ సంపద 12,370 కోట్ల డాలర్లకు చేరింది. వారెన్‌ బఫెట్‌ సంపద 12,170 కోట్ల డాలర్లకు చేరినట్లు ఫోర్బ్స్‌ పేర్కొంది. ఈ ఒక్క ఏడాదిలోనే అంటే నాలుగు నెలల్లో గౌతమ్‌ అదానీ సంపద 4300 కోట్ల డాలర్లు అదనంగా పెరిగింది. అదానీ గ్రూప్‌నకు చెందిన ఆరు కంపెనీలు స్టాక్‌ మార్కెట్‌ లిస్టయ్యాయి. వాటిలో అదానీ ఎంటర్‌ప్రైజస్‌, అదానీ గ్రీన్‌ ఎనర్జి, అదానీ పవర్‌, అదానీ విల్మర్‌, అదాని పోర్ట్స్‌ వంటి కంపెనీలు ఉన్నాయి.