For Money

Business News

కుప్పకూలిన చైనా : యూరోలో అదే పతనం

గత శుక్రవారం ప్రారంభమైన ఈక్విటీ మార్కెట్ల పతనం యూరో మార్కెట్లలో కూడా కొనసాగింది. ఉదయం ఆసియా మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. చైనా మార్కెట్లు అయిదు నుంచి ఆరు శాతం నష్టపోగా, హాంగ్‌సెంగ్‌ 3.77 శాతం నష్టపోయింది. ఇక మన మార్కెట్లలో నిఫ్టి ఒకదశలో 16904ని తాకి.. అక్కడి నుంచి కోలుకుని ఇపుడు 16988 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే నష్టం 176 పాయింట్లు. సెన్సెక్స్‌ కూడా 500 పాయింట్ల నష్టంతో ట్రేడవుతోంది. మిడ్ సెషన్‌లో ప్రారంభమైన యూరో మార్కెట్లలోకూడా భారీ నష్టాలు నమోదు అవుతున్నాయి. జర్మనీ డాక్స్‌ నష్టం 1.5 శాతమైనా..ఇతర సూచీలు రెండు శాతందాకా నష్టపోయాయి. అమెరికా ఫ్యూచర్స్‌ కూడా 0.8 శాతంపైగా నష్టంతో ఉన్నాయి. ఈ లెక్కన చూస్తే నిఫ్టికి క్లోజింగ్‌లో ఒత్తిడి వస్తుందేమో చూడాలి.