For Money

Business News

16,950 దిగువన నిఫ్టి

సింగపూర్‌ నిఫ్టికి మించి భారీ నష్టాలతో నిఫ్టి ప్రారంభమైంది. నిఫ్టి 16928 స్థాయికి చేరిన నిఫ్టి ప్రస్తుతం 16946 వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 226 పాయింట్ల నష్టంతో ఉంది. దాదాపు అన్ని సూచీలు 1.25 శాతంపైగా నష్టంతో ఉన్నాయి. నిఫ్టిలో కేవలం మూడర షేర్లు మాత్రమే గ్రీన్‌లో ఉన్నాయి. పవర్‌ గ్రిడ్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఎన్‌టీపీసీ .. మిగిలిన షేర్లు నష్టాల్లో ఉన్నాయి. బ్రిటానియా టాప్‌ లూజర్‌గా నిలిచింది. పామోలిన్‌ ఎగుమతులను ఇండోనేషియా ఆపేయడంతో వంట నూనెల కంపెనీల షేర్లు భారీ లాభాల్లో ట్రేడవుతున్నాయి. అదాని విల్మర్‌ ఇవాళ కూడా లాభాల్లో ఉంది. నిఫ్టి మిడ్‌క్యాప్‌ సూచీలో 25 షేర్లు ఉండగా, అన్నీ నష్టాల్లో ఉన్నాయి. బ్యాంక్‌ నిఫ్టిలో కేవలం ఐసీఐసీఐ బ్యాంక్‌ ఒక్కటే లాభాల్లో ఉంది. నష్టాల్లో ఇండస్‌ ఇండ్‌ టాప్ లూజర్‌గా ఉంది.