For Money

Business News

ఈ వారం మరో నాలుగు ఐపీఓలు

గత వారం నాలుగు కంపెనీలు క్యాపిటల్‌ మార్కెట్‌లో ప్రవేశించాయి. దాదాపు అన్నింటికి ఆదరణ లభించింది. ముఖ్యంగా పిజా హట్‌, కేఎఫ్‌సీ బ్రాండ్ల ఫ్రాంచైజీ అయిన దేవయాని ఇంటర్నేషనల్‌కు భారీ ఆదరణ లభించింది. ఇక ఈ వారం కూడా నాలుగు కంపెనీలు పబ్లిక్‌ ఇష్యూకు వస్తున్నాయి. నువొకొ విస్తాస్‌, కార్‌ ట్రేడ్‌, కెమ్‌ప్లాస్ట్‌ సన్మాన్‌, ఆప్టస్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌.
వీటిలో రెండు సోమవారం, మిగిలిన రెండు మంగళవారం ప్రారంభం కానున్నాయి.

కార్‌ట్రేడ్‌ టెక్‌ ఐపీఓ ఇవాళ ప్రారంభం అవుతుంది. ఒక్కో షేర్‌ ధర శ్రేణి రూ.1585 – రూ.1,618. బుధవారం ఇష్యూ క్లోజవుతుంది. కనీసం 9 షేర్లకు ధరఖాస్తు చేయాలి. ఇవాళ ప్రారంభం కానున్న మరో ఐపీఓ నువొకొ విస్తాస్‌. నిర్మా గ్రూప్‌నకు చెందిన ఈ కంపెనీ షేర్‌ ధర శ్రేణి రూ. 560-570. కనీసం 26 షేర్లకు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.
ఇక రేపు ప్రారంభమయ్యే ఐపీఓ కెమ్‌ప్లాస్‌ సన్మార్‌. స్పెషాలిటీ కెమెకల్స్‌ తయారు చేసే ఈ కంపెనీ రూ. 530-రూ. 541 ధర రేంజ్‌లో షేర్లను ఆఫర్‌ చేస్తోంది. 2012లో ఈ కంపెనీ రూ. 5 ధర వద్ద డీలిస్ట్‌ చేశారు. ఇపుడు అదే కంపెనీ 9 ఏళ్ళ తరవాత రూ. 560లకు షేర్‌ను ఆఫర్‌ చేస్తున్నారు. కనీసం 27 షేర్లకు దరఖాస్తు చేసుకోవాలి.
ఆప్టస్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీ ఐపీఓ కూడా రేపు ప్రారంభం కానుంది. ఈ కంపెనీ రూ. 346-353 రేంజ్‌లో షేర్లను ఆఫర్‌ చేస్తోంది. కనీసం 42 షేర్లకు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.
విచిత్రమేమిటంటే ఈ నాలుగు కంపెనీ ఐపీఓలలో కార్‌ ట్రేడ్‌ టెక్‌ మినహా ఇతర ఐపీఓలకు మార్కెట్‌లో క్రేజ్‌ లేకపోవడం. కార్‌ ట్రేడ్‌ టెక్‌ పైనా లిస్టింగ్‌ ధరపై పెద్ద అంచనాలు లేవు.