హ్యుందాయ్ పండుగ ఆఫర్లు
హ్యుందాయ్ ఇండియా పలు మోడళ్లపై వినియోగదారులకు వివిధ రకాల ఆఫర్లు ప్రకటించింది. మోడల్‌ను బట్టి గరిష్ఠంగా రూ.50,000 దాకా రాయితీలు ఇస్తోంది. తాజా ఆఫర్లు శాంత్రో, గ్రాండ్ ఐ10 నియోస్, ఆరాపై ఆఫర్ చేస్తున్నారు. ఈ ఆఫర్లు సెప్టెంబరు 30 వరకు మాత్రమే ఉంటాయని, పూర్తి వివరాలు తమ వెబ్‌సైట్లో ఉన్నాయని కంపెనీ పేర్కొంది. అన్నికన్నా ఎక్కువ ఆఫర్ గ్రాండ్ ఐ10 నియోస్‌పై ఇస్తోంది. ఈ మోడల్‌పై అత్యధికంగా రూ.50 వేల మేరకు ఆఫర్లు ఇస్తుండగా.. ఇందులో నేరుగా రూ.35 వేలు నగదు డిస్కౌంట్ ఇస్తోంది. ఇక శాంత్రో హ్యాచ్‌బ్యాక్ విషయానికొస్తే రూ.40 వేల దాకా ఆఫర్లు ఉన్నా క్యాష్ డిస్కౌంట్ రూ.25 వేలు ఇస్తోంది. ఇక ఆరా మోడల్‌పై అత్యధికంగా రూ.50 వేల ఆఫర్లు ఉన్నా… నగదు రాయితీ రూ.35 వేలు ఇస్తోంది. ఇతర ఆఫర్ల కోసం కంపెనీ వెబ్‌సైట్ చూడండి.