For Money

Business News

రూ. 110 కోట్ల కార్వీ ఆస్తులు సీజ్

కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌ లిమిటెడ్‌కు చెందిన రూ 110 కోట్ల ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) జప్తు చేసింది. దీంతో ఇప్పటి వరకు కార్వా గ్రూప్‌నకు చెందిన రూ.1,985 కోట్ల ఆస్తులను సీజ్‌ ఈడీ జప్తు చేసింది. తాజా సీజ్‌తో కార్వీకి చెందిన రూ.2,095 కోట్ల ఆస్తుల‌ను ఈడీ సీజ్ చేసిన‌ట్టయింది. కార్వీకి చెందిన పలు కంపెనీలు ఇన్వెస్టర్లు తమ దగ్గర ఉంచిన షేర్లను తాకట్టు పెట్టి రూ. 2800 కోట్ల రుణాలను అక్రమ పద్దతిలో కార్వీ గ్రూప్‌ తీసుకుంది. తన కుమారుడు రజత్‌ పార్థసారథి, అధిరాజ్‌ పార్థసారథికి జీతం, ఇతర ఖర్చుల కింద భారీ మొత్తాన్ని బదిలీ చేసినట్లు ఈడీ గుర్తించింది. ఇన్వెస్టర్ల షేర్లను తాకట్టు పెట్టి తీసుకున్న రుణాలను తన గ్రూప్‌ కంపెనీలలో పెట్టుబడి రూపంలో పార్థసారథి తరలించారని ఈడీ పేర్కొంది. దీంతో అనుబంధ కంపెనీల ఆస్తులు భారీగా పెరిగింది. ఇపుడు తప్పుడు మార్గంలో ఆ ఆస్తులు అమ్మి భారీగా లబ్ది పొందాలని పార్థసారథి చూస్తున్నారని ఈడీ ఆరోపిస్తోంది.