For Money

Business News

డాలర్‌, క్రూడ్‌, బులియన్‌…డౌన్‌

ఉక్రెయిన్‌ యుద్ధం త్వరగా ముగుస్తుందన్న ఆశతో ఈక్విటీ మార్కెట్లు పరుగులు పడుతున్నాయి. ఇన్నాళ్ళూ జోరు మీద ఉన్న డాలర్‌, క్రూడ్‌, బులియన్‌ అంతే స్పీడుతో పడుతున్నాయి. కరెన్సీ మార్కెట్‌లో ఇవాళ ఏడు ప్రధాన కరెన్సీలతో పోలిస్తే డాలర్‌ భారీగా క్షీణించింది. డాలర్‌ ఇండెక్స్‌ ఏకంగా ఒక శాతం దాకా క్షీణించింది. ఇదే సమయంలో డాలర్‌తో పాటు క్రూడ్‌ కూడా అయిదు శాతంపైగా క్షీణించింది. డాలర్‌, క్రూడ్‌ పతనం భారత మార్కెట్లకు వరం. బ్రెంట్‌ క్రూడ్‌ ఇపుడు 121 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇక బులియన్‌ మార్కెట్‌లోనూ అమ్మకాల ఒత్తిడి జోరుగా ఉంది. బంగారంతోపాటు వెండి కూడా రెండు శాతం క్షీణించాయి. ఔన్స్‌ బంగారం ధర మళ్ళీ 2000 డాలర్ల దిగువకు వచ్చేసింది. ఇపుడు 1988 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.