For Money

Business News

డిజిటల్‌ డాలర్ వచ్చేస్తోందా?

అమెరికాతో పాటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కనిష్ఠ స్థాయి రిస్క్‌ ఉండేలా క్రిప్టో కరెన్సీలు వంటి డిజిటల్‌ ఆస్తులను తయారు చేసే విషయంలో ఒక వ్యూహాన్ని ఖరారు చేయాల్సిందిగా అమెరికా అధ్యక్షుడు జో బైడన్‌ ఆదేశించారు.క్రిప్టో కరెన్సీ పరిశ్రమలో కూడా ఆవిష్కరణను ప్రోత్సహించే విధంగా ఈ వ్యూహం ఉండాలని ఉత్తర్వలో ఆయన పేర్కొన్నారు. క్లుప్తంగా చెప్పాలంటే అమెరికా సొంత డిజిటల్‌ డాలర్‌ను తయారు చేసేందుకు పరిశోధన, అభివృద్ధి అవకాశాలను చూడాలని ఈ ఉత్తర్వులో బైడెన్‌ ఆదేశించారు. అనేక మంది అమెరికన్లకు క్రిప్టో కరెన్సీలు ఒక ఫైనాన్షియల్‌ ఆస్తిగా మారాయని, కాబట్టి ఇదే తరహాలో డిజిటల్‌ డాలర్‌ను తయారు చేసే అంశంపై దృష్టి పెట్టాలని ఆయన ఆదేశించారు. క్రిప్టో కరెన్సీలలో ట్రేడింగ్‌ చేసే, ఉపయోగించేవారికి మార్గదర్శకాలు కూడా తయారు చేయాల్సిందిగా ఆర్థిక శాఖ విభాగాన్ని బైడెన్‌ ఆదేశించారు. క్రిప్టో కరెన్సీ మార్కెట్‌లో మోసాలు, మార్కెట్‌ హెచ్చుతగ్గులు లేకుండా ఈ మార్గదర్శకాలు ఉండాలని పేర్కొన్నారు. భవిష్యత్‌ పేమెంట్‌ సిస్టమ్స్‌లో డిజిటల్‌ అసెట్స్‌, బ్లాక్‌ చైన్‌ టెక్నాలజీల పాత్రపై కూడా పరిశోధన చేయాలని బైడన్‌ ఆదేశించారు.