For Money

Business News

భారీ లాభాల్లో వాల్‌స్ట్రీట్‌

యూరో మార్కెట్లకు కొనసాగింపుగా అమెరికా మార్కెట్లలో కూడా ఈక్విటీ మార్కెట్లు భారీ లాభాలతో ట్రేడవుతున్నాయి. యూరో మార్కెట్లు ఏకంగా ఆరేడు శాతం లాభంతో ట్రేడవుతున్నాయి. జర్మనీ డాక్స్‌ అత్యధికంగా ఏడు శాతంపైగా లాభంతో ఉంది. ఉక్రెయిన్‌ యుద్ధం త్వరలోనే ముగుస్తుందన్న ఆశ మార్కెట్లలో కన్పిస్తోంది. ఇతర మార్కెట్లు ఆరు శాతం లాభంతో ట్రేడవుతున్నాయి. ఇతర మార్కెట్లతో పోలిస్తే యూరో మార్కెట్లు భారీగా నష్టపోయాయి. దీంతో రికవరీ కూడా చాలా జోరుగా ఉంది. అమెరికా మార్కెట్‌లో ఇవాళ బ్యాంక్‌, ఐటీ షేర్లకు గట్టి మద్దతు లభించింది. నాస్‌డాక్‌ మూడు శాతం లాభపడగా, ఎస్‌ అండ్‌ పీ 500 సూచీ 2 శాతం పైగా లాభపడింది. డౌజోన్స్‌ కూడా 2 శాతం లాభంతో ట్రేడవుతోంది. ట్రెండ్‌ చూస్తుంటే వాల్‌స్ట్రీట్‌ మరిన్ని లాభాలతో క్లోజయ్యే అవకాశముంది.