For Money

Business News

దూకుడు వొద్దని ఆర్బీఐ హెచ్చరిక

ప్రభుత్వ రంగ బ్యాంక్‌లను ప్రైవేటీకరించే విషయంలో కేంద్ర ప్రభుత్వం దూకుడుగా వ్యవహరించడం సరికాదని ఆర్బీఐ పేర్కొంది. ఇటీవలి కాలంలో పీఎస్‌యూ బ్యాంకులు మార్కెట్‌ విశ్వాసాన్ని గొప్పగా చూరగొన్నాయని, ఈ బ్యాంకుల్ని ప్రైవేట్‌పరం చేస్తే మంచికన్నా హాని ఎక్కువ జరుగుతుందని ఆర్బీఐ కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించింది. ప్రైవేట్‌ బ్యాంకుల లాభాలను ఆర్జించడంలో రాణిస్తే… పీఎస్‌యూ బ్యాంకు ప్రజలకు అందుబాటులోకి బ్యాంకులను తీసుకెళతాయని పేర్కొంది. గరిష్ఠ లాభాలు పొందడమే లక్ష్యం కాకపోతే… పలు అంశాల్లో ప్రైవేట్‌ బ్యాంక్‌లకంటే ప్రభుత్వ బ్యాంకులే మెరుగని ఆర్బీఐ తన నివేదికలో పేర్కొనడం విశేషం. ప్రైవేట్‌ బ్యాంక్‌ల మాదిరిగా లాభాలను పెంచుకునే ఏకైక లక్ష్యంతోనే ప్రభుత్వ రంగ బ్యాంక్‌లు పనిచేయవని.. ఆర్థిక సేవల విస్తరణ లక్ష్యాల సాధనకు అవి కృషి చేస్తాయని ఆర్బీఐ వివరించింది.రెండు ప్రభుత్వ రంగ బ్యాంక్‌ల్లో మెజారిటీ వాటాను విక్రయించి, ప్రైవేటీకరించనున్నట్లు 2021 ఫిబ్రవరి 1నాటి బడ్జెట్‌ ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించిన విషయం తెలిసిందే.