For Money

Business News

DHFL షేర్ల ట్రేడింగ్‌ నిలిపివేత

దీవాన్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్ (DHFL) షేర్ల ట్రేడింగ్‌ను సోమవారం నుంచి సస్పెండ్‌ చేస్తున్న నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీ (NSE) బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజీ (BSE)లు ప్రకటించాయి. సోమవారం ఎన్‌సీఎల్‌టీ డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ కంపెనీని పిరమల్ గ్రూప్‌ టేకోవర్‌కు అంగీకరించింది. ఈ విషయాన్ని మంగళవారం అంటే ఈనెల 8న డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు తెలిపింది. అయితే ఎన్‌సీఎల్‌టీ అంగీకరించిన ఒప్పందం పత్రంలో తమ కంపెనీ షేర్లకు విలువ లేదని, జీరో అన్న విషయం చెప్పలేదు. జూన్‌9వ తేదీన ఈ విషయాన్ని స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు చెబుతూ రాతపూర్వకంగా ఎన్‌సీఎల్‌టీ నుంచి ఉత్తర్వులు రాలేదని చెప్పింది. డీహెచ్‌ఎల్‌ఎఫ్‌ షేర్‌ గత శుక్రవారం ఎన్‌ఎస్‌ఈలో రూ. 16.10 వద్ద ముగిసింది.