For Money

Business News

నిఫ్టి.. టెక్నికల్స్‌కు కలిసొచ్చింది

మార్కెట్‌ పూర్తిగా ఆల్గో ట్రేడర్స్‌ చేతిలోకి వెళ్ళినట్లుంది. టెక్నికల్స్‌ ప్రకారం లెవల్స్‌ ముందే నిర్ణయించడం… నిఫ్టిని అలాగే నియంత్రించడం అలవాటుగా మారింది.15,850 స్టాప్‌లాస్‌తో అమ్మమని టెక్నికల్‌ అనలిస్టులు ఉదయమే స్పష్టం చేశారు. అలాగే నిఫ్టికి 15,710 ప్రాంతంలో మద్దతు వస్తుందన్నారు. నిఫ్టికి 157,50 ప్రాంతంలోనే మద్దతు అందడం మినహా అంతా ఆల్గో ట్రేడర్స్‌ చెప్పినట్లే సాగుతోంది. వాస్తవానికి పొజిషనల్ ట్రేడర్స్‌ ఏమాత్రం నష్టపోలేదు. డే ట్రేడర్స్‌లో పైస్థాయిలో అమ్మినవారికి, దిగువ స్థాయిలో కొన్నవారికీ లాభాలు బాగానే వచ్చాయి. నిఫ్టి క్రితం ముగింపుతో పోలిస్తే 62 పాయింట్ల లాభంతో 15,799 పాయింట్ల వద్ద ముగిసింది. బ్యాంక్‌ నిఫ్టి ఇవాళ నష్టంతో ముగిసినా… మెటల్స్‌ మార్కెట్‌కు అండగా నిలిచాయి. అలాగే కొన్ని ఫార్మా కౌంటర్లు కూడా. నిఫ్టి పైకి బలంగా కన్పిస్తున్నా మార్కెట్‌లో ఓ మోస్తరు అమ్మకాలైతే సాగుతున్నాయి.

నిఫ్టి టాప్‌ గెయినర్స్‌
టాటా స్టీల్‌ 1,163.10 4.37
JSW స్టీల్‌ 732.50 3.78
కోల్‌ ఇండియా 162.25 3.67
డాక్టర్‌ రెడ్డీస్‌ 5,460.00 3.17
హిందాల్కో 393.40 2.08

నిఫ్టి టాప్‌ లూజర్స్‌
యాక్సిస్‌ బ్యాంక్‌ 737.50 -0.91
దివీస్‌ ల్యాబ్‌ 4,335.00 -0.86
ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ 1,015.60 -0.85
ఎల్‌ అండ్‌ టీ 1,506.95 -0.84
బజాజ్‌ ఫిన్‌ సర్వ్‌ 11,900.00 -0.78