For Money

Business News

భారీగా క్షీణించిన క్రూడ్‌ ఆయిల్‌

దేశీయంగా ఆయిల్ మార్కెటింగ్‌ కంపెనీలు పెట్రోల్‌, డీజిల్‌ ధరలను స్థిరంగా ఉంచుతున్నా.. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్‌ ఆయిల్‌ ధర తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతోంది. గత వారం చివర్లలో క్రూడ్‌ ఆయిల్‌ తీవ్ర అమ్మకాల ఒత్తిడి వచ్చింది. అమెరికాతో పాటు పలు ప్రధాన దేశాల్లో ఆర్థిక మాంద్యం వచ్చే ఛాన్స్‌ ఉందంటూ వస్తున్న వార్తలకు ఆయిల్‌ మార్కెట్‌ చాలా తీవ్రంగా రియాక్టయింది. కేవలం మూడు సెషన్స్‌లో పది శాతంపైగా క్రూడ్‌ ధర క్షీణించింది. 122 డాలర్ల నుంచి 112 డాలర్లకు పడిపోయింది. ఇవాళ ఉదయం బ్రెంట్‌ క్రూడ్‌ 112.4 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఆర్థిక మాంద్యం భయంతో పాటు డాలర్‌ బాగా బలపడటం కూడా క్రూడ్‌ ఆయిల్‌ పతనానికి మరో కారణంగా చెప్పొచ్చు. డాలర్‌ ఇండెక్స్‌ ఇపుడు 101.44 వద్ద ట్రేడవుతోంది.