For Money

Business News

స్థిరంగా సింగపూర్‌ నిఫ్టి

గత శుక్రవారం అమెరికా మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి. నాస్‌డాక్‌ ఒకశాతంపైగా లాభంతో ముగియగా, డౌజోన్స్‌ స్వల్ప నష్టంతో ముగిసింది. ఎస్‌ అండ్ పీ 500 సూచీలో పెద్దగా మార్పులు లేవు. అంతకు ముందు యూరోపియన్‌ మార్కెట్లలో జర్మనీ వంటి కీలక మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. ఇక ఉదయం నుంచి ఆసియా మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఆరంభంలో కొన్ని మార్కెట్లు గ్రీన్‌లో ఉన్నా… అమెరికా ఫ్యూచర్స్‌ గ్రీన్‌ నుంచి రెడ్‌లోకి మారడంతో ఆసియాలో ట్రెండ్‌ మారింది. జపాన్‌ నిక్కీ, హాంగ్‌సెంగ్‌ మార్కెట్లు ఒక శాతం వరకు నష్టంతో ఉన్నాయి. చైనా మార్కెట్లు మిశ్రమంగా ఉన్నాయి. కోస్పి ఏకంగా రెండు శాతంపైగా నష్టంతో ఉంది. ఈ నేపథ్యంలో సింగపూర్ నిఫ్టి 25 పాయింట్ల లాభంతో ఉంది. సో…నిఫ్టి స్థిరంగా ట్రేడయ్యే అవకాశాలు ఉన్నాయి.