For Money

Business News

MSMEలకు రుణ హామీ పథకం పొడిగింపు

చిన్న పరిశ్రమల కోసం కేంద్ర ప్రవేశ పెట్టిన క్రెడిట్‌ గ్యారంటీ స్కీమ్‌ను 2022 మార్చి 31వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది. రుణ భారంతో తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న చిన్న, మధ్య తరహా పరిశ్రమల కోసం కేంద్రం ఈ స్కీమ్‌ను ప్రవేశ పెట్టింది. కరోనా కారణంగా దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ ప్రకటించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం 2020 జూన్‌ 26వ తేదీ నుంచి అమల్లో ఉన్న ఈ పథకం ఈ ఏడాది మార్చి 31తో ముగిసింది. అయితే ఎంఎస్‌ఎంఈ రంగం నుంచి విజ్ఞప్తులు రావడంతో మరో ఆరు నెలలు పెంచింది. ఆ గడవు కూడా గత సెప్టెంబర్‌ నెలతో ముగియడంతో మరో ఆరు నెలలు పొడిగిస్తూ ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది.