For Money

Business News

కుప్పకూలిన కీలక రంగాలు

ఇవాళ మూడు కీలక గణాంకాలు వచ్చాయి. మూడు దారుణంగా ఉన్నాయి. ద్రవ్యలోటు అంచనాలను తప్పింది. జీడీపీ అనుకున్న స్థాయిలో వృద్ధి చెందలేదు. వీటికి కారణం.. కీలక రంగాలన్నీ పడకేయడమే. సెప్టెంబర్‌ నెలలో ఎనిమిది కీలక రంగాలు 7.8 శాతం చొప్పున వృద్ధి చెందితే.. అక్టోబర్‌ నెలలో ఆ వృద్ధి రేటు 0.1శాతానికి పడిపోయింది. అంటే దాదాపు వృద్ధి లేదన్నమాట. పలు రంగాల్లో వృద్ధి రేటు మైనస్‌లోకి వెళ్ళింది.
సెప్టెంబర్‌తో పోలిస్తే అక్టోబర్‌లో…
బొగ్గు రంగం.. 12 శాతం నుంచి 3.6 శాతానికి
క్రూడ్‌ ఆయిల్… మైనస్‌ 2.3 శాతం నుంచి మైనస్‌ 2.2 శాతానికి
నేచురల్ గ్యాస్‌… 1.7 శాతం నుంచి మైనస్‌ 4.2 శాతానికి
రిఫైనరీ ఉత్పత్తులు… 6.6 శాతం నుంచి మైనస్‌ 3.1 శాతానికి
ఎరువులు.. 11.8 శాతం నుంచి 5.4 శాతానికి
స్టీల్‌ … 5.7 శాతం నుంచి 4 శాతానికి
సిమెంట్‌… 12.4 శాతం నుంచి మైనస్‌ 4.3 శాతానికి
విద్యుత్‌… 11.6 శాతం నుంచి 0.4 శాతానికి