For Money

Business News

తగ్గిన వంటనూనెల ధరలు

ఇండోనేషియా పామోలిన్‌ ఆయిల్‌పై ఇప్పటి వరకు విధిస్తున్న ఎగుమతి సుంకాలను తగ్గించడంతో వంటనూనెల ధరలు తగ్గుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు బాగా తగ్గినందున దేశీయంగా ధరలు తగ్గించాలని కేంద్రం వంటనూనెల తయారీ కంపెనీలపై ఒత్తిడి తేస్తోంది. దీంతో ఇపుడు అన్ని కంపెనీలు వంటనూనెల ధరలు తగ్గిస్తున్నాయి. ఇక ఫార్చ్యూన్‌ బ్రాండ్‌ ఉత్పత్తుల ధరలను లీటరుకు రూ. 30 తగ్గిస్తున్నట్లు అదానీ గ్రూప్‌ కంపెనీ అదానీ విల్మర్‌ ప్రకటించింది. సన్‌ ఫ్లవర్‌ ఆయిల్‌ ధర రూ.210 నుంచి రూ.199కి, రైస్‌బ్రాన్‌ ఆయిల్‌ ధర రూ.225 నుంచి రూ. 210కి తగ్గింది. వేరుసెనగ నూనె ధర రూ.220 నుంచి రూ.210కి తగ్గించారు. అంతర్జాతీయ మార్కెట్లో పామాయిల్‌ టన్ను ధర 400-450 డాలర్ల మేర తగ్గిందని, దాంతో ఇక్కడ లీటర్‌ పామోలిన్‌ నూనె ధర రూ. 170 నుంచి రూ.144కు సవరించినట్టు అదానీ ఎండీ తెలిపారు. అలాగే ప్రియా ఫుడ్స్‌ కూడా రైస్‌ రిచ్‌ ఆయిల్‌ను రూ. 172, సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ను రూ.176, పామాయిల్‌ను రూ. 127, వేరుసెనగ నూనె రూ.170లకు విక్రయిస్తోంది. ఫ్రీడం బ్రాండ్‌తో లభిస్తున్న సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ను ఇపుడు రూ. 192కు అమ్ముతున్నారు.