For Money

Business News

బొగ్గు దిగుమతి చేసుకోనున్న కోల్ ఇండియా

2015 తరవాత కోల్‌ ఇండియా తొలిసారి బొగ్గును దిగుమతి చేసుకోనుంది. దేశీయంగా డిమాండ్‌ పెరుగుతున్న స్థాయిలో కోల్ ఇండియా ఉత్పత్తి చేయలేక పోతోంది. కనీసం పదిశాతం బొగ్గుని దిగుమతి చేసుకోవాలని రాష్ట్రాలను కేంద్రం ఆదేశించింది. అయితే ప్రతి రాష్ట్ర విడిగా దిగుమతి చేసుకోవడం కంటే… అన్ని రాష్ట్రాల తరఫున కోల్‌ ఇండియా దిగుమతి చేసుకోవడం మంచిదని రాష్ట్రాలు సూచించాయి. దీంతో బొగ్గును దిగుమతిచేసుకునే ప్రక్రియను కోల్‌ ఇండియా ప్రారంభించనుంది. దిగుమతి బొగ్గు ధరను తరవాత రాష్ట్రాల నుంచి కోల్‌ ఇండియా వసూలు చేసుకుంటుంది.