For Money

Business News

మూడు రెట్లు పెరిగిన కెనరా బ్యాంక్‌ లాభం

ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో కెనరా బ్యాంక్‌ దూసుకు పోతోంది. ఎస్‌బీఐ తరవాత అద్భుత పనితీరు కనబరుస్తోంది. సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో ఈ బ్యాంక్‌ రూ.1,332.61 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో బ్యాంక్‌ నమోదు చేసిన రూ.444.41 కోట్ల లాభంతో పోలిస్తే ఇది దాదాపు మూడు రెట్లు అధికంగా. బ్యాంక్‌ మొత్తం ఆదాయం రూ.20,793.92 కోట్ల నుంచి రూ.21,331.49 కోట్లకు పెరిగింది. స్థూల ఎన్‌పీఏలు 8.23 శాతం (రూ.53,437.92 కోట్లు) నుంచి 8.42 శాతానికి (రూ.57,853.09 కోట్లు) చేరాయి. కాని నికర ఎన్‌పీఏలు 3.42% (రూ.21,063.28 కోట్లు) నుంచి 3.21 శాతానికి (రూ.20,861.99 కోట్లు) తగ్గడం విశేషం. కేటాయింపులు రూ.3,974.02 కోట్ల నుంచి రూ.3,360.23 కోట్లకు తగ్గడంతో బ్యాంక్‌ నికర లాభంపై ప్రభావం చూపింది. బ్యాంక్‌ కన్సాలిడేటెడ్‌ నికర లాభం రూ.465.88 కోట్ల నుంచి రూ.1,100.59 కోట్లకు చేరింది. ఆదాయం రూ.22,638.26 కోట్ల నుంచి రూ.23,876 కోట్లకు చేరింది.