For Money

Business News

వడ్డీ రేట్లు పెంచిన కెనరా బ్యాంక్‌

రుణాలపై వడ్డీ రేట్లను పెంచినట్లు కెనరా బ్యాంక్‌ ప్రకటించింది. ఎంసీఎల్‌ఆర్‌ను 0.5 శాతం చొప్పున పెంచినట్లు తెలిపింది. కొత్త రేట్లు ఇవాళ్టి అర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తాయి. అన్ని రకాల రుణాలపై ఈ వడ్డీని పెంచినట్లు పేర్కొంది. ఏడాది ఎంసీఎల్‌ఆర్‌ 7.65 శాతం నుంచి 7.75 శాతానికి పెరిగినట్లు బ్యాంక్‌ తెలిపింది. ఆటో, పర్సనల్‌, గృహ రుణాలకు ఈ రేటును ప్రామాణికంగా తీసుకుంటారు. గత నెలలో ఆర్బీఐ వడ్డీ రేట్లను పెంచడంతో తాము ఈ నెలలో పెంచినట్లు బ్యాంక్‌ పేర్కొంది.