For Money

Business News

హ్యుందాయ్‌ నుంచి వెన్యూ ఎన్‌లైన్‌..

హ్యుందాయ్‌ మరో కొత్త కారును మార్కెట్లోకి విడుదల చేసింది. వెన్యూ ఎన్‌ లైన్‌ పేరుతో కొత్త కాంపాక్ట్‌ ఎస్‌యూవీని తీసుకొచ్చింది. ఎన్‌6 వేరియంట్‌ ధరను రూ.12.16 లక్షలు (ఎక్స్‌షోరూమ్‌), ఎన్‌8 వేరియంట్‌ ధరను రూ.13.15 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. డ్యూయల్‌ టోన్‌ కలర్‌ ఆప్షన్‌ కావాలంటే రూ.15వేలు అదనంగా చెల్లించాల్సి ఉంటుందని కంపెనీ పేర్కొంది. వెన్యూ ఎన్‌లైన్‌ బుకింగ్స్‌ ఇప్పటికే ప్రారంభం కాగా.. 1.3 లక్షల యూనిట్లు ఆర్డర్లు పెండింగ్‌లో ఉన్నాయని కంపెనీ తెలిపింది. నార్మల్‌, ఎకో, స్పోర్ట్‌ డ్రైవింగ్‌ మోడ్స్‌ ఉన్నాయని పేర్కొంది. హ్యుందాయ్‌ ఇప్పటికే వెన్యూ, క్రెటా, అల్కజార్‌, టక్సన్‌, కోనా ఎలక్ట్రిక్‌ పేరిట ఎస్‌యూవీలను విక్రయిస్తున్న విషయం తెలిసిందే.