For Money

Business News

కొనసాగుతున్న నష్టాలు

వాల్‌స్ట్రీట్‌ ఈవారం నష్టాలతో ప్రారంభమైంది. గత శుక్రవారం భారీనష్టాలతో ముగిసిన వాల్‌స్ట్రీన్‌ నిన్న పనిచేయలేదు. ఇవాళ ఉదయం నుంచి అమెరికా ఫ్యూచర్స్‌ గ్రీన్‌లో ఉన్నా… మార్కెట్లు మాత్రం నష్టాలతో ప్రారంభమయ్యాయి. అన్ని సూచీలు నష్టాల్లో ఉన్నా… నష్టాలు అరశాతం లోపే ఉన్నాయి. మరోవైపు యూరో మార్కెట్లు స్వల్ప లాభాలతో ముగిశాయి. జర్మనీ డాక్స్‌ మాత్రం 0.87 శాతం లాభంతో ముగిసింది. యూరోస్టాక్స్‌ 50 సూచీ మాత్రం 0. 29 శాతం లాభంతో ముగిసింది.ఇవాళ డాలర్‌ మరింత బలపడింది. డాలర్‌ ఇండెక్స్‌ 110ని దాటింది. మరోవైపు క్రూడ్‌ ఆయిల్‌ మిశ్రమంగా ఉంది. బ్రెంట్‌ క్రూడ్‌ రెండు శాతం దాకా నష్టపోగా, అమెరికా ఆయిల్ గ్రీన్‌లో ఉంది. బులియన్‌లో పతనం కొనసాగుతోంది. డాలర్‌ పెరగడమే దీనికి ప్రధాన కారణం.