For Money

Business News

ఎల్‌ఐసీలో 20 % విదేశీ పెట్టుబడికి ఓకే

ఎల్‌ఐసీ ప్రైవేటీకరణే వొద్దని జనం మొత్తుకుంటుంటే… మోడీ ప్రభుత్వం ఏకంగా 20 శాతం ప్రత్యక్ష విదేశీ పెట్టుబడి (FDI) కి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిందని రాయిటర్స్‌ వార్తా సంస్థ పేర్కొంది. ఇవాళ ప్రధాని మోడీ అధ్యక్షతన సమావేశమైన కేబినెట్‌ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వం ఇపుడున్న చట్టాల్లో మార్పులు చేయాల్సి ఉంటుంది. మరి ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే చట్టాలకు మార్పు చేస్తారా లేదా ఆర్డినెన్స్‌ తెస్తారా అన్నది చూడాలి. ఎందుకంటే మార్చి 14వ తేదీన పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఎల్ఐసీ పబ్లిక్‌ ఆఫర్‌ వచ్చే నెల ప్రారంభం అవుతున్న సమయంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ పబ్లిక్‌ ఆఫర్‌ ద్వారా 5 శాతం వాటా విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సెబి వద్ద ప్రాస్పెక్టస్‌ కూడా ఎల్‌ఐసీ దాఖలు చేసింది. ఇపుడున్న నిబంధనల ప్రకారం ఎల్‌ఐసీలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెట్టేందుకు అనుమతి లేదు. ఈ మేరకు ప్రస్తుత చట్టాలను మార్చాల్సి ఉంది.