For Money

Business News

దిగువన రియల్‌ ఎస్టేట్‌లో రివర్సల్‌

అనేక సంవత్సరాల పాటు నిస్తేజంగా ఉన్న రియల్‌ఎస్టేట్‌ ఇపుడు పరుగులు పెట్టేందుకు సిద్ధమౌతోంది. అనేక అవాంతరాల మధ్య ప్రతికూల పరిస్థితులను రియల్‌ ఎస్టేట్‌ రంగం తట్టుకుంది. రేరా నిబంధనలు తరవాత డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ కుంభకోణం, కరోనా.. ఇలా అనేక సమస్యల నుంచి ఈ రంగం బయటపడింది. గత కొన్ని నెలల నుంచి ప్రధాన మార్కెట్లలో దూసుకుపోతోంది. ముఖ్యంగా ముంబై, హైదరాబాద్‌, బెంగళూరు, పుణె, గుర్‌గ్రామ్‌లపై రియల్‌ ఎస్టేట్‌ కంపెనీలు దృష్టి పెడుతున్నాయి. ఒక్కో చదరపు అడుగుపై రియలైజేషన్‌ కూడా పెరుగుతోంది. ఏడాదిలో రియలైజేషన్‌ 8 నుంచి 10 శాతం పెరిగిందని కొన్ని కంపెనీలు అంటున్నారయి.పెద్ద కంపెనీలు చాలా వరకు వడ్డీ భారాన్ని తగ్గించుకున్నాయి. దీంతో చిన్న కంపెనీలతో పోలిస్తే పెద్ద కంపెనీలు అధిక మార్జిన్‌తో డీల్స్‌ చేస్తున్నాయి. దీనివల్ల ఏవైనా ఇబ్బందులు ఎదురైనా పెద్ద కంపెనీలు తట్టుకుని నిలబడుతున్నాయి. ఇటీవల స్టీల్‌, సిమెంట్‌ వంటి ముడిపదార్థాల ధరలు పెరిగినా… మొత్తంగా ఆ పెరుగుదల మేరకు మార్జిన్స్ తగ్గించుకోవడమో లేదా కస్టమర్లకు బదిలీ చేయడమో పెద్ద కంపెనీలు చేయనున్నాయి. దీంతో రియల్‌ ఎస్టేట్‌ రంగంలోని కంపెనీలపై స్టాక్‌ మార్కెట్‌లో ఆసక్తి పెరుగుతోంది. గత కొన్ని నెలలుగా ఈ రంగానికి చెందిన షేర్లకు డిమాండ్‌ పెరుగుతోంది. గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌, డీఎల్‌ఎఫ్‌తో పాటు డీబీ రియాల్టీస్‌ వంటి కంపెనీలు ఇపుడు మార్కెట్‌లో తరచూ వార్తల్లో ఉంటున్నాయి. వ్యాపారాలను పునర్‌ వ్యవస్థీకరించుకుంటున్నాయి. చాలా వరకు రుణ భారం తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలో ఆకస్మికంగా భారీగా వడ్డీ రేట్లు పెరిగే అవకాశం లేదని రియల్‌ ఎస్టేట్‌ కంపెనీలు భావిస్తున్నాయి. కొటక్‌ ఇన్‌స్టిట్యూషనల్ ఈక్వటీస్‌, హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ సంస్థలు ఇటీవలే భారత రియల్‌ ఎస్టేట్‌ రంగంతో తమ అంచనాను పంచుకున్నాయి. ఈ రంగం ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు.. పరిష్కార మార్గాలను రాశాయి. ముఖ్యంగా బెంగళూరు కేంద్రంగా ఉన్న రియల్‌ ఎస్టేట్‌ కంపెనీలు ఈసారి బాగా రాణిస్తాయని కొటక్‌ అంటోంది. ప్రిస్టేజ్‌ ఎస్టేట్‌, బ్రిగేడ్‌ ఎంటర్‌ప్రైజస్, శోభా డెవలపర్స్‌ వంటి బెంగళూరు కంపెనీలతో పాటు ముంబైకి చెందిన మాక్రోటెక్‌, ఒబెరాయ్‌ రియాల్టి కంపెనీలు కూడా బాగా రాణిస్తాయానికి అంచనా వేసింది.ఎడెల్‌వైసిస్‌ మాత్రం డీఎల్‌ఎఫ్‌ను గట్టిగా రెకమెండ్‌ చేస్తోంది. అలాగే ఇటీవల బాగా తగ్గిన గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌ షేర్‌ను కూడా సిఫారసు చేస్తోంది. ఇక హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ ఫేవరేట్స్‌… డీఎల్‌ఎఫ్‌, ఒబెరాయ్‌, ఫినక్స్‌ మిల్స్, మహీంద్రా లైఫ్‌ సైన్సస్‌, బ్రిగేడ్‌ ఎంటర్‌ప్రైజస్‌ ఉన్నాయి. మార్కెట్‌ పడుతున్న సమయంలో ఈ షేర్లలో దీర్ఘకాలిక ఇన్వెస్ట్‌మెంట్‌ అవకాశంగా భావించవచ్చని ఈ రీసెర్చి కంపెనీలు అంటున్నాయి.