For Money

Business News

రూ. 50,000 దిగువకు బంగారం

అంతర్జాతీయ మార్కెట్‌లో డాలర్, బాండ్‌ ఈల్డ్స్‌ పెరగడంతో మెటల్స్‌పై ఒత్తిడి ఎక్కువైంది. బులియన్‌ మార్కెట్‌ నిన్న నష్టాల్లో ముగియగా ఇవాళ కూడా నష్టాలతోనే ప్రారంభమైంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్‌ బంగారం ధర 1629 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఫారెక్స్‌ మార్కెట్‌ రూపాయి పతనం పెద్దగా లేదు. దాదాపు నిన్న స్థాయి వద్దే ప్రారంభమైంది. ఎంసీఎక్స్‌ ఫ్యూచర్స్‌ మార్కెట్‌లో పది గ్రాముల స్టాండర్డ్‌ బంగారం డిసెంబర్‌ కాంట్రాక్ట్‌ రూ. 50,067 వద్ద ప్రారంభమైంది. అంటు రూ. 50,000 దిగువకు చేరడం ఖాయంగా కన్పిస్తోంది. క్రితం ముగింపుతో పోలిస్తే రూ.130 నష్టంతో బంగారం ట్రేడవుతోంది. ఇక వెండిలో నష్టాలు అధికంగా ఉన్నాయి. ఇవాళ ఉదయమే కిలో వెండి డిసెంబర్‌ కాంట్రాక్ట్‌ రూ. 55,614ను తాకింది. క్రితం ముగింపుతో పోలిస్తే రూ. 370 నష్టంతో ఉంది.