For Money

Business News

బులియన్‌… ఆగని పతనం

అమెరికాలో ద్రవ్యోల్బణం దిగి రాకపోవడంతో ఈక్విటీ మార్కెట్లలో అమ్మకాల వెల్లువెత్తున్నాయి. ఇన్వెస్టర్లు షేర్లు, బులియన్‌ బదులు.. ప్రభుత్వ బాండ్లవైపు పరుగులు తీస్తున్నారు. ఇవాళ డాలర్‌ స్థిరంగా ఉన్నా… అమ్మకాల కారణంగా బులియన్‌ ధరలు తగ్గుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఒకటిన్నర శాతం తగ్గాయి. అయితే మన దగ్గర ఫార్వర్డ్‌ మార్కెట్‌ బంగారం, వెండి ధరలు ఒకదశలో భారీగా తగ్గినా… అమెరికా షేర్‌ మార్కెట్‌ ప్రభావంతో ధరలు పెరిగాయి. ఎందుకంటే రేపు మన షేర్‌ మార్కెట్‌లో భారీ అమ్మకాలు రావడం, రూపాయి మరింత పతనం కావడం ఖాయం. దీంతో ఇక్కడ బంగారం వెండి కోలుకుంటున్నాయి. ఇవాళ ఎంసీఎక్స్‌ ఫ్యూచర్స్‌ మార్కెట్‌లో పది గ్రాముల స్టాండర్డ్‌ బంగారం డిసెంబర్‌ కాంట్రాక్ట్‌ రరూ. 50400లకు పడిపోయింది. అంటే నిన్నటి ధర కన్నా రూ. 500 క్షీణించిందన్నమాట. ఇపుడు కోలుకుని రూ. 50526 వద్ద ట్రేడవుతోంది. కాని అసలు పతనం వచ్చింది వెండిలో. ఇవాళ కిలో వెండి డిసెంబర్‌ కాంట్రాక్ట్‌ ధర రూ.56,194కు పడిపోయింది. అంటే నిన్నటి ధరతో పోలిస్తే రూ. 1,250 తగ్గిందన్నమాట. ఇపుడు కోలుకుని రూ.675 నష్టంతో రూ.56,650 వద్ద ట్రేడవుతోంది. సో… మన రూపాయి విలువ భారీగా తగ్గితే… బులియన్‌ ధరలు భారీగా క్షీణించవన్నమాట.