For Money

Business News

కుప్పకూలిన బులియన్‌

ఒకవైపు స్పాట్‌ మార్కెట్‌తో పాటు ఫ్యూచర్‌ మార్కెట్‌లో బులియన్‌ భారీగా క్షీణించాయి. పీటీఐ వార్తా సంస్థ ప్రకారం ఇవాళ దేశీయ మార్కెట్‌లో స్పాట్‌ మార్కెట్‌లో స్టాండర్డ్‌ బంగారం ధర రూ.810 తగ్గింది. ఢిల్లీలో పది గ్రాముల స్టాండర్డ్‌ బంగారం ధర రూ. 810 తగ్గగా, కిలో వెండిపై రూ. 1500కుపైగా తగ్గింది. నిన్న బంగారం ధర రూ. 47,706గా ఉండగా, ఇవాళ 46,896కు దిగింది. కిలో వెండి ధర నిన్న రూ.64,268 కాగా ఇవాళ రూ. 1,548 తగ్గి రూ.62,720కు చేరింది
ఫ్యూచర్స్‌లో…
అంతర్జాతీయ మార్కెట్లో డాలర్‌ పెరగడం, మన కరెన్సీ తగ్గడంతో బులియన్‌ ధరల్లో మార్పులు వచ్చాయి. ఎంసీఎక్స్‌లో స్టాండర్డ్‌ బంగారం (డిసెంబర్‌ కాంట్రాక్ట్‌) ఇపుడు రూ. 591 నష్టంతో రూ.47,432 వద్ద ట్రేడవుతోంది. అదే వెండి డిసెంబర్‌ కాంట్రాక్ట్‌ రూ.2,240 తగ్గి రూ.62,931 వద్ద ట్రేడవుతోంది. అంటే బంగారం స్వల్పంగా కోలుకోగా, వెండి ఇంకా దారుణంగా పడిందన్నమాట.