For Money

Business News

రియల్‌ ఎస్టేట్‌కు మద్దతు ఇవ్వాలి

రియల్ ఎస్టేట్ రంగం 2021లో కోలుకుంది. ఇపుడు కోవిడ్ పూర్వ నాటి స్థాయిలో దాదాపు 90% వరకు రికవరైంది.
IBEF (ఇండియా బ్రాండ్‌ ఈక్విటీ ఫౌండేషన్‌) నివేదిక ప్రకారం ఇది 2025 నాటికి దేశ GDPలో రియల్‌ ఎస్టేట్‌ రంగం వాటా 13% శాతానికి చేరనుంది. రియల్ ఎస్టేట్, టెక్స్‌టైల్స్‌పై దృష్టి పెట్టడం వల్ల దిగువ స్థాయిలో ఉన్న ప్రజలకు చాలా అవకాశాలు లభిస్తాయని కొటక్ మహీంద్రా మ్యూచువల్ ఫండ్ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ (సీఈఓ) నీలేష్‌ షా చెప్పారు.
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టే బడ్జెట్‌పై మార్కెట్‌లో చాలా అంచనాలు ఉన్నాయి. రియల్ ఎస్టేట్‌ నిర్మాణం, టెక్స్‌టైల్ పరిశ్రమ వంటి రెండు రంగాలకు విధానాలు ఉండాలని నీలేషా కోరుతున్నారు. “ఈ బడ్జెట్ వినియోగంపై దృష్టి పెట్టాలి, ఈ రోజు దేశ ఆర్థికవ్యవస్థ వృద్ధిని పునరుద్ధరించడానికి లేదా వేగవంతం చేయడానికి ఇది చాలా అవసరమ”ని ఆయన అన్నారు. ఈ రెండు రంగాలపై ప్రభుత్వం అధిక దృష్టి సారిస్తే పలు కీలక మార్పులను సాధించవచ్చని ఆయన అన్నారు. ‘రియల్ ఎస్టేట్ పుంజుకుంటుంది, కానీ పూర్తి స్థాయిలో ఈ రంగం తన సామర్థ్యానికి చేరుకోవాలంటే ప్రభుత్వం మరింత చేయూత చేయాల్సి ఉంటుంద’ని ఆయన అన్నారు. స్టాంప్ డ్యూటీ పన్నును తగ్గించడానికి సీతారామన్ కృషి చేశారని, అలాగే గత బడ్జెట్‌లో ఆఫర్డబుల్‌ (అందుబాటు ధరల్లో) గృహాలపై ఉన్న ప్రయోజనాలను పొడిగించడం వల్ల పరిశ్రమ వెంటనే కోలుకోగలిగింది. అయితే హౌసింగ్‌తో పాటు నిర్మాణ ఉప రంగాలపై కూడా మరింత దృష్టి పెడితే అనేక మంది ఉపాధి అవకాశాలు మెరుగు పడుతాయిన నీలేష్‌ షా అభిప్రాయపడ్డారు. రియల్ ఎస్టేట్ సంతృప్తికర స్థాయిలో వ వృద్ధి చెందుతోంది. గత 2-3 సంవత్సరాలలో ఇంటి ధరలు స్థిరంగా ఉన్నాయి. కొన్ని నగరాల్లో తగ్గాయి. అలాగే ఉన్నత స్థాయి వర్గాల ఆర్థిక స్థోమత మెరుగుపడిందని నీలేష్‌ షా పేర్కొన్నారు.