For Money

Business News

అశోక్‌ లేల్యాండ్‌ పాత్రపై ఈడీ ఆరా

నిషేధించిన వాహనాలను దొంగ సర్టిఫికెట్లతో రిజిస్ట్రేషన్‌ చేసిన కేసులో అశోక్‌ లేల్యాండ్‌ పాత్ర గురించి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) విచారిస్తోంది. బీఎస్‌-3 వాహనాలను నిషేధిస్తూ సుప్రీం కోర్టు 2017 మార్చి 29వ తేదీన తీర్పు ఇచ్చింది. దీంతో ఈ మోడల్‌ వాహనాల అమ్మకాలు ఆగిపోయాయి. అయితే వీటిని తుక్కు కింది ఈ కంపెనీ తక్కువ ధరకు అమ్మింది. వీటిని కొనుగోలు చేసినవారు వివిధ రాష్ట్రాల్లో దొంగ ఇన్వాస్‌లు సృష్టించి బీఎస్‌-4 వాహనాలను వాటిని నడుపుతున్నారు. ఈ కేసులో టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌ రెడ్డి, ఆయన అనుచరుడు సి గోపాల్ రెడ్డికి చెందిన రూ. 22.10 కోట్ల ఆస్తులను ఈడీ జప్తు చేసిన విషయం తెలిసిందే. ఇలా నిషేధించిన వాహనాలను కొని లబ్దిపొందన మొత్తం రూ. 38.36 కోట్లు ఉంటుందని ఈడీ అంచనా వేస్తోంది. ఇవాళ జప్తు చేసిన మొత్తంలో రూ. 6.31 కోట్లు బ్యాంక్‌ బ్యాలెన్స్‌, నగదు, నగలు. ప్రభాకర్‌ రెడ్డి, గోపాల్‌ రెడ్డి, వారి కుటుంబ సభ్యులకు చెందిన రూ. 15.79 కోట్ల విలువైన 68 ఆస్తులను జప్తు చేసినట్లు ఈడీ పేర్కొంది. ఈ కేసులో అశోక్‌ లేల్యాండ్‌ కంపెనీ అధికారుల పాత్ర గురించి కూడా ఈడీ ఆరా తీస్తోంది.