For Money

Business News

పేటీఎం, టాటా మోటార్స్‌, ఎం అండ్‌ ఎం

మూడు ప్రధాన కంపెనీలపై బ్రోకరేజీ సంస్థలు తమ అంచనాలను వెల్లడిచాయి. టాటా మోటార్స్‌పై జేపీ మోర్గాన్‌ ఓవర్‌వైట్‌ రేటింగ్ ఇచ్చింది. టాటా మోటార్స్‌ టార్గెట్‌ ధర రూ. 525గా పేర్కొంది. 2024కల్లా కంపెనీ పూర్తిగా రుణాల నుంచి విముక్తి అవుతుందని పేర్కొందని, రానున్న మూడు సంవత్సరాల్లో జేఎల్‌ఆర్‌ ఈవీగా మార్చే పని స్పీడు అందుకుంటుందని జేపీ మోర్గాన్‌ పేర్కొంది. ఇక ఎం అండ్‌ ఎం షేర్‌కు రూ. 1312 టార్గెట్‌గా సీఎల్‌ఎస్‌ఏ పేర్కొంది. XUV700, థార్‌ మోడల్స్‌తో కంపెనీ మార్జిన్‌ పెరుగుతందని వెల్లడించింది. అధిక మార్జిన్స్‌ కారణంగా కంపెనీ నికర లాభం పెరిగే అవకాశముందని పేర్కొంది. కంపెనీ ఈవీ బిజినెస్‌ విలువను 230 కోట్ల డాలర్లుగా అంచనా వేసింది సీఎల్‌ఎస్‌ఏ. ఇక పేటీఎం షేర్‌ను కొనుగోలు చేయాలని సిటీ బ్యాంక్‌ పేర్కొంది. ఈ బ్రోకరేజీ సంస్థ పేటీఎం షేర్‌ టార్గెట్‌ రూ. 915గా పేర్కొంది. పేమెంట్స్‌ మానెటైజేషన్‌లో స్థిర అభివృద్ధి ఉందని పేర్కొంది. ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌లను చాలా వేగంగా విస్తరిస్తోందని పేర్కొంది. 2025కల్లా కంపెనీ లాభాల్లోకి రావొచ్చని సిటీ అంచనా వేస్తోంది.