For Money

Business News

118 డాలర్లకు బ్రెంట్ క్రూడ్‌

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తాజా ట్వీట్‌ ఇపుడు ఆయిల్‌ మార్కెట్‌లోకలకలం రేపుతోంది. హర్ముజ్‌ జలసంధి విషయంలో తనతో కలిసి రాని మిత్ర దేశాలకు వార్నింగ్‌ ఇస్తూ ట్రంప్‌ ట్వీట్‌ చేశారు. ‘మీకు కావాలంటే మా దగ్గరకు రండి.. మా వద్ద చాలా చమురు ఉంది… ఇస్తాం లేదంటే… హర్ముజ్‌కు వెళ్ళండ’ని ట్రంప్‌ ట్వీట్‌ చేశారు. మీకు చేతనైతే హర్ముజ్‌ జలసంధిని కబ్జా చేసుకోండని ఆయన సలహా ఇచ్చారు. అంటే అమెరికా క్రూడ్‌కు, ఇతర దేశాల క్రూడ్‌కు ఆయన స్పష్టమైన తేడా చూపారు. ట్రంప్‌ ప్రకటన తరవాత అమెరికాలో లభించే WTI క్రూడ్‌ ధర స్వల్పంగా తగ్గగా, బ్రెంట్ క్రూడ్‌ ధర ఏకంగా 118 డాలర్లను దాటింది. ఈ రెండింటి మధ్య ఇంత తేడా రావడం ఇటీవల ఇదే మొదటిసారి. మరోవైపు హర్ముజ్‌ జలసంధి ద్వారా వెళ్ళే నౌకలపై చార్జి వసూలు చేయాలని ఇరాన్‌ నిర్ణయించినట్లు వార్తలు వస్తున్నాయి. మొత్తానికి ఇరాన్‌ యుద్ధం విషయంలో ట్రంప్‌ వైఖరిపై ఒక స్పష్టత లేకపోవడంతో ఆయిల్‌ మార్కెట్‌లో ఇంకా అధిక ధరలు కొనసాగుతున్నాయి.