ట్రంప్ తాజా డెడ్లైన్ ఏప్రిల్ 6
ఏప్రిల్ 6వ తేదీలోగా ఇరాన్ రాజీకి రావాలని, హర్ముజ్ జలసంధిని తెరవాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ డెడ్లైన్ విధించారు. లేకుంలే ఇరాన్ ఆయిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్పై దాడి చేస్తామని హెచ్చిరించారు. అయితే ట్రంప్ డెడ్లైన్ హెచ్చరికను ఇరాన్ తేలిగ్గా తీసుకుంది. ఒకవైపు యుద్ధం చేస్తూ శాంతి చర్చల గురించి ట్రంప్ మాట్లాడటం హాస్యాస్పదమని పేర్కొంది. మరోవైపు ప్రపంచ దేశాలపై ట్రంప్ మరోసారి తన కోపాన్ని ప్రదర్శించారు. హర్ముజ్ జలసంధి విషయంలో నాటోతో సహా పలు మిత్రదేశాలు తన మాటను పట్టించుకోకపోవడంపై ఉక్రోషం వెళ్ళగక్కారు. హర్మూజ్ జలసంధి కారణంగా ఇంధనం కొరత ఎదుర్కొంటున్న దేశాలు తమ దేశం నుంచి చమురు కొనుక్కోవాలని సలహా ఇచ్చారు. లేదంటూ ఆ దేశాలు జలసంధిని స్వాధీనం చేసుకోండని అన్నారు. మాకు అండగా రానపుడు, మీ కోసం మీరే పోరాటం చేయాలని ట్రంప్ హితువు పలికారు.
