For Money

Business News

క్రూడ్‌ ఆయిల్‌ @ 96

నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినపుడు బ్రెంట్‌ క్రూడ్‌ 110 డాలర్లుగా ఉండేది. తరవాత తగ్గుతూ వచ్చింది.2020 కరోనా సమయంలో 9.12 డాలర్లకు పడింది. అపుడు ఒక్కపైసా కూడా తగ్గించకుండా లక్షల కోట్లు ఖజానాకు తరలించిన మోడీ ప్రభుత్వం ఇపుడు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటోంది. గత కొన్ని నెలల నుంచి క్రూడ్‌ పెరుగుతోంది. 90 డాలర్ల ప్రాంతంలో స్థిరంగా ఉంటోంది. పడినా వెంటనే మళ్ళీ అదే స్థాయికి వచ్చేస్తోంది.ఇపుడు ఉక్రెయిన్‌ యుద్ధ నేపథ్యంలో బ్రెంట్‌ క్రూడ్‌ ధర ఇవాళ ఉదయం 96.07 డాలర్లను తాకింది. ఇపుడు 95.66 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. చిత్రంగా కొన్ని సెషన్స్‌గా డాలర్‌ కూడా పెరుగుతూ వస్తోంది. డాలర్‌ ఇండెక్స్‌ ఇపుడు 96పైన ఉంటోంది. అంటే క్రూడ్‌ కోసం భారీ మొత్తం చెల్లించాల్సి వస్తోంది.