For Money

Business News

NIFTY TODAY: 17,191 కీలకం

ఉక్రెయిన్‌ యుద్ధం భయాల కారణంగా స్టాక్‌ మార్కెట్లతో పాటు అనేక మార్కెట్లలో అనిశ్చితి నెలకొంది. ఈ నేపథ్యంలో సింగపూర్‌ నిఫ్టి 230 పాయింట్ల నష్టంతో ట్రేడవుతోంది. నిఫ్టి క్రితం ముగింపు రూ.17,374. సో.. ఓపెనింగ్‌లోనే నిఫ్టి అత్యంత కీలక స్థాయిలను కోల్పోయి 17200 దిగువకు చేరనుందన్నమాట. నిఫ్టిలో భారీ అమ్మకాలు సాగుతున్నాయి. ఇప్పటికే ఓవర్‌ సోల్డ్‌ పొజిషన్‌లో చేరిన నిఫ్టికి ఇది మరో పెద్ద షాక్‌. యూరో మార్కెట్లు నష్టాలు తక్కువ ఉన్నా… అమెరికా ఫ్యూచర్స్‌ కోలుకున్నా.. నిఫ్టిలో కొనుగోళ్ళ మద్దతు వస్తుంది. ఎందుకంటే టెక్నికల్‌ బై సిగ్నల్ ఇస్తున్నాయి. ఇవాళ్టికి డే ట్రేడింగ్‌ లెవల్స్‌ ఇవి…

నిఫ్టికి అప్‌ బ్రేకౌట్‌ 17550పైనే…
నిఫ్టికి కీలకం 17,274
తొలి మద్దతు 17241
రెండో మద్దతు 17208
డౌన్‌ బ్రేకౌట్‌ 17191
ఈ స్థాయి దిగువకు వస్తే 17054కి చేరడం ఖాయం.
తొందరపడి కొనుగోలు చేయొద్దు. లెవల్స్‌ను చూసి కొనండి.