For Money

Business News

సెబీ ముందుకు ఎన్‌డీటీవీ వివాదం

ఎన్‌డీటీవీ టేకోవర్‌ పంచాయితీ మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ ముందుకు చేరింది. ఈ టేకోవర్‌కు కీలకంగా మారిన వారెంట్లను షేర్లుగా మార్చుకోవడం చెల్లుబాటు అవుతుందా? కాదా? అనే విషయం తేల్చాలని ఎన్‌డీటీవీ.. సెబీని కోరింది.అదానీ గ్రూప్‌ కూడా ఈ విషయం తేల్చాలని సోమవారం సెబీకి లేఖ రాసింది. గతంలో ఎన్‌డీటీవీ ప్రమోటర్లు తమ వాటాల బదిలీ చేయకుండా రెండేళ్ళ పాటు సెబి నిషేధం విధించింది. ఎన్‌డీటీవీ మాతృసంస్థ ఆర్‌ఆర్‌పీఆర్‌ హోల్డింగ్‌ లిమిటెడ్‌కు విశ్వప్రధాన్‌ కమర్షియల్‌ అనే కంపెనీ ఇచ్చిన రుణానికి బదులుగా ఇచ్చిన వారెంట్లను 29.18 శాతం ఈక్విటీ షేర్లుగా మార్చుకుంటున్నట్టు ఈ నెల 23న అదానీ గ్రూప్‌ ప్రకటించింది. రెండు రోజుల్లో సదరు షేర్లను తమ పేరుపై బదిలీ చేయాలని కోరింది. అయితే సెబీ ఆదేశాల నేపథ్యంలో తాము షేర్లను బదిలీ చేయడం లేదని ఎన్‌డీటీవీ పేర్కొంది. దీంతో డీల్‌పై వివాదం కొనసాగుతోంది. మరోవైపు స్టాక్‌ మార్కెట్‌లో ఎన్‌డీటీవీ షేర్‌ రోజూ అయిదు శాతం చొప్పున అప్పర్‌ సీలింగ్‌తో క్లోజవుతోంది.