For Money

Business News

NIFTY LEVELS: లాభాలు తీసుకోండి

వరుసగా మూడో రోజు మార్కెట్‌లో ర్యాలీ కొనసాగనుంది. ఆరంభంలో పొజిషన్స్ తీసుకున్నవారు ఇవాళ పాక్షిక లాభాలు తీసుకోవడం మర్చిపోవద్దు. నిఫ్టి ఇవాళ 17420 నుంచి 17450 మధ్య లాభాలు స్వీకరించడం మంచిది. అయితే కొనేవారు మాత్రం వెయిట్‌ చేయడం మంచిది. మార్కెట్‌ పడేవరకు ఆగి కొనుగోలు చేయడం మంచిదని సీఎన్‌బీసీ టీవీ18 మేనేజింగ్‌ ఎడిటర్‌ అనూజ్‌ సింఘాల్‌ అన్నారు. క్రూడ్‌ గనుక 85 డాలర్ల వైపు పయనిస్తే నిఫ్టి ఆల్‌టైమ్‌ రికార్డు స్థాయిని తాకే అవకాశముందని ఆయన అంటున్నారు. నిఫ్టి 17350 స్థాయిని ఇవాళ అధిగమించనుంది. అయితే 17456ని దాటుతుందేమో చూడండి. ఈ స్థాయి పైన ముగిస్తే మాత్రం నిఫ్టి 17660 వైపు పయనిస్తుందని భావించవచ్చు. అయితే పడితేనే నిఫ్టిని కొనుగోలు చేయమని సలహా ఇస్తున్నారు. నిఫ్టి గనుక బలహీన పడే పక్షంలో 17400 ప్రాంతంలో గట్టి అమ్మకాల ఒత్తిడి రావొచ్చు. దిగువన 17351, 17305 వద్ద మద్దతు లభించవచ్చు. ఈ ర్యాలీ మిస్సయిన వారు ఈ స్థాయిలో కొనుగోళ్ళు చేయొచ్చని డేటా అనలిస్ట్‌ వీరేందర్‌ కుమార్‌ అంటున్నారు.